Mon Dec 23 2024 00:18:00 GMT+0000 (Coordinated Universal Time)
KTR : నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు నాంపల్లి కోర్టుకు రానున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఆయన వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేయడానికి రానున్నారు. కేటీఆర్ నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు నష్టం కలిగించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
స్టేట్మెంట్ రికార్డు...
ఇటీవల ఈ పిటీషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు ఈరోజు కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో తనకు సాక్షులకుగా పేర్కొన్న బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ కూడా హాజరు కానున్నారు. కేటీఆర్ స్టేట్మెంట్తో పాటు వీరందరి స్టేట్మెంట్లు కూడా ఈరోజు రికార్డు చేయనున్నారు.
Next Story