Mon Nov 18 2024 09:27:59 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారైనా గవర్నర్ ప్రసంగం ఉంటుందా?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాససభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాససభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 12.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈసారైనా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. గత బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
గ్యాప్ పెరగడంతో...
గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరడగం, రాజ్భవన్ లో పెండింగ్ ఫైళ్లు పేరుకుపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి గవర్నర్ ను బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానిస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది. గవర్నర్ ప్రసంగం సంప్రదాయం లేకుండానే సభలను ప్రారంభించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణలోనూ బడ్జెట్ ప్రవేశపెడతారంటున్నారు. ఎన్నికల బడ్జెట్ కావడంతో పూర్తి స్థాయి కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.
Next Story