Mon Dec 23 2024 10:18:26 GMT+0000 (Coordinated Universal Time)
కోడిపుంజుకి బస్ టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిందీ ఘటన. గోదావరి ఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కరీంనగర్ వెళ్తోంది.
బస్సెక్కితే టికెట్ తీసుకోవాలి. పరిమితికి మించిన లగేజీ ఉంటే దానికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకైతే హాఫ్ టికెట్, పెద్దలకైతే ఫుల్ టికెట్. కానీ.. కోడిపుంజుకు కూడా టికెట్ ఇవ్వడం ఎక్కడైనా చూశారా ? కోడిపుంజు పెద్ద లగేజీలాగా దానికి కూడా టికెట్ కొట్టాడో కండక్టర్. ఇప్పడిదే తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఎంతలా అంటే.. విషయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకూ వెళ్లింది.
Also Read : కంటి ఆపరేషన్ కోసం వస్తే.. శవాన్ని అప్పగించారు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిందీ ఘటన. గోదావరి ఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కరీంనగర్ వెళ్తోంది. మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సు ఎక్కి, కరీంనగర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నాడు. తనతోపాటు ఓ కోడిపుంజు కూడా ఉంది. కాగా.. బస్సు సుల్తానాబాద్ చేరుకున్న సమయంలో కండక్టర్ అయిన తిరుపతికి కోడి కూత వినిపించింది. అంతే.. వెంటనే కోడికి టికెట్ కొట్టి అలీ చేతికిచ్చాడు. ఆ టికెట్ చూసి షాకవ్వడం ప్యాసింజర్ల వంతైంది. ఇంతకీ కోడిపుంజుకి టికెట్ ఎంతో తెలుసా ? అక్షరాలా రూ.30.
Also Read : మోదీ "మాయ" ఇంకా ఎన్నేళ్లు?
దాంతో ప్రయాణికుడు కోడిపుంజుకి రూ.30 టికెట్ ఆ ? అదేంటి అని అడగ్గా.. ప్రాణంతో ఉండే ప్రతి జీవికి టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పాడు. దాంతో అలీ ఏం మాట్లాడకుండా తనవద్ద ఉన్న చిల్లర ఇచ్చేశాడు. ఓ వ్యక్తి ఆ టికెట్ ను ఫోటో తీసి, జరిగిన విషయంతో ట్వీట్ చేయగా.. అదికాస్తా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకూ వెళ్లింది. విషయంపై స్పందించిన సజ్జనార్.. ఏం జరిగిందో తెలుసుకుని, బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు.
Next Story