Tue Dec 24 2024 13:37:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఎల్లుండి తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.
ఈ నెల 21న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. కీలక బిల్లులను ఆమోదం పొందనున్నారు. ఈ సమావేశంలో వర్షాకాల శాసనసభ సమావేశాల నిర్వహణ, రుణమాఫీ వంటి అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఆగస్టు పదిహేనో తేదీలోపు తెలంగాణలో రైతులు తీసుకున్న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో దీనిపైనే ఎక్కువచర్చజరగనుంది.
ప్రధానంగా రుణమాఫీపైనే...
ఈ రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపైనే ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. విధివిధానాలు ఎలా ఉండాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చ చేసే అవకాశముందంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుని ముందుకు వెళ్లే అవకాశముంది. దీంతో పాటు వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుంచి జరపాలన్న దానిపై కూడా ఈ సమావేశం తర్వాత ఒక స్పష్టత రానుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story