Cables from electric poles: వాటిని తొలగించాలట.. అయ్యో ఇప్పుడెలా?
విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని
విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించారు. కేబుల్‌ల తొలగింపు గురించి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియజేయడానికి జూలై 27, ఆగస్టు 7, ఆగస్టు 28 తేదీల్లో మూడుసార్లు సమావేశాలు నిర్వహించామన్నారు. ఆగస్టు 7న జరిగిన సమావేశంలో ప్రధాన రహదారులపై వారం రోజుల్లోగా, ఇతర ప్రధాన రహదారులపై రెండు వారాల్లోగా నిబంధనల ప్రకారం కేబుల్ ఆపరేటర్లు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. కొంతమంది కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమావేశాల్లో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ తొలగింపు ప్రక్రియలో సహకరించలేదన్నారు.