Mon Dec 23 2024 12:11:56 GMT+0000 (Coordinated Universal Time)
కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పగడ్బందీగా
తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా పై పోలీసులు దృష్టి సారించాలని ఇటీవలే సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ.. నిందితులను పట్టుకుంటున్నారు. తాజాగా నిత్యం రద్దీగా ఉండే.. కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి ద్రావణాన్ని జూబ్లిహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పగడ్బందీగా దాడి చేసి గంజాయి ద్రావణాన్ని పట్టుకున్నారు. డిగ్రీ చదువుతున్న శివశంకర్ అనే వ్యక్తిని, టాక్సీ డ్రైవర్ గా పని చేసే ముస్తఫాలతో పాటు మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో మైనర్ బాలుడిని పునరావాస కేంద్రానికి తరలించి, మిగతా ఇద్దరు నిందితుల్ని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story