Sun Dec 22 2024 02:26:31 GMT+0000 (Coordinated Universal Time)
కంటోన్మెంట్ పాకిస్థాన్ లో లేదు: బండి సంజయ్
కంటోన్మెంట్ ప్రాంతాలపై కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ వారా అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్. కంటోన్మెంట్ లో సరైన డ్రైనేజీ, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్ కుమార్ మారేడ్‌పల్లిలోని డబుల్ బెడ్రూం హౌసింగ్ కాలనీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కంటోన్మెంట్ ప్రాంతాలపై కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు బండి సంజయ్. ఈ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆరోపించారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.700 కోట్ల నిధులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. 2,40,000 ఇళ్లకు కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ ఆరోపించారు. కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న కేసీఆర్ నిర్ణయంపై బండి సంజయ్ మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ ఆ పని చేశారని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు.
Next Story