Mon Dec 23 2024 13:21:20 GMT+0000 (Coordinated Universal Time)
‘చదువుల్రావు’ సృష్టికర్త కన్నుమూత
వ్యంగ్య చిత్రాల రూపకర్తగా, కార్టూనిస్ట్ గా పాఠకులను అలరించిన సత్యమూర్తి పూర్తిపేరు భావరాజు వెంకట సత్యమూర్తి. కొంతకాలంగా
ప్రముఖ సీనియర్ కార్టూనిస్ట్, ‘చదువుల్రావు’ వంటి వ్యంగ్య చిత్రాల సృష్టికర్త సత్యమూర్తి (84) అనారోగ్యంతో కన్నుమూశారు. వ్యంగ్య చిత్రాల రూపకర్తగా, కార్టూనిస్ట్ గా పాఠకులను అలరించిన సత్యమూర్తి పూర్తిపేరు భావరాజు వెంకట సత్యమూర్తి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కు సత్యమూర్తి స్వయాన అన్నయ్య.
సత్యమూర్తి గీసిన వ్యంగ్య కార్టూన్లను ఆంధ్రపత్రిక ముఖచిత్రంగా ప్రచురించింది. సత్యమూర్తి ప్రతిభను గుర్తించి.. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించింది. అంతేకాదు.. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ, ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమి తదితర సంస్థల నుండి కూడా సత్యమూర్తి అవార్డులను అందుకున్నారు. సత్యమూర్తికి భార్య జోగేశ్వరి, కుమార్తె ప్రొఫెసర్ పద్మావతి ఉన్నారు. ఆయన కుమారుడు సాయిభాస్కర్ ఇటీవలే మృతి చెందారు.
Next Story