Sun Dec 22 2024 23:04:41 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కేసు నమోదు
మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. కోవా లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు
మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. కోమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడ రోజురోజుకి ముదురుతోంది. కోమరభీం జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య ప్రోటోకాల్ విషయంలో వివాదం తలెత్తింది.
ప్రోటోకాల్ వివాదం...
ప్రోటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారి తీయడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుండగా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు 296(B), 351(2) సెక్షన్ల కేసు నమోదు చేశారు. ఇప్పటికే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story