Mon Dec 23 2024 05:14:59 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. పేట్బహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భూకబ్జా కేసు నమోదు అయింది.
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. పేట్బహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భూకబ్జా కేసు నమోదు అయింది. పేట్ బహీరాబాద్ లోని 32 ఎకరాలను మల్లారెడ్డి కుటుంబీకులు కబ్జా చేసినట్లు రెవెన్యూ శాఖ అధికారుల సర్వేలో తేలింది. దీంతో ఆయనతో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్, కుమారుడు, మరో పదమూడు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పేట్ బషీర్ బాద్ లో...
పేట్ బషీర్ బాద్ లో అసైన్మెంట్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని శ్రీనివాసరెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయింది. ఇటీవలే అక్కడ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఈ ల్యాండ్ పై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇందులో కబ్జా కు గురయినట్లు తేలడంతో పాటు ఫిర్యాదు అందడంతో మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదయింది.
Next Story