Tue Dec 24 2024 00:20:12 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
ఎమ్యెల్యేల కొనుగోలు కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణను ధర్మాసనం జులై 31వ తేదీకి వాయిదా వేసింది.
ఎమ్యెల్యేల కొనుగోలు కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం జులై 31వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల పిటీషన్లను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణలో తమకు న్యాయం జరగదని, సీబీఐకి అప్పగించాలని వారు హైకోర్టులో పిటీషన్ వేశారు.
జులై 31కి వాయిదా...
దీంతో హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులై 31వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకూ కేసు విచారణను సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.
Next Story