Mon Dec 23 2024 08:18:42 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ అర్వింద్ పై కేసు నమోదు !
తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ పై
తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ పై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఓ వ్యాపారి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది నవంబర్ 8వ తేదీన నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోయిన్ పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కల్యాణ్ సందీప్ ఫిర్యాదు మేరకు తాము ఎంపీ అర్వింద్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద ఎంపీ అర్వింద్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Next Story