Mon Dec 23 2024 08:45:38 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయాల్లోకి చికోటి ప్రవీణ్.. ఏ పార్టీ వైపు వెళుతున్నారో?
ఎన్నో వివాదాల్లో ఉన్న క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా
ఎన్నో వివాదాల్లో ఉన్న క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. ప్రస్తుతం ఢిల్లీలో ఆయన బీజేపీ అగ్రనేతలను వరుసగా కలవడం హాట్ టాపిక్ గా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి క్యాసినో కింగ్గా పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అలాంటి వ్యక్తిని బీజేపీ పార్టీలోకి తీసుకుంటుందా లేదా అనేది సస్పెన్స్.
తెలుగు రాష్ట్రాలలోని పలువురు వ్యాపారవేత్తలను విదేశాలకు తీసుకుని వెళ్లి గ్యాంబ్లింగ్ ఆడించడం దగ్గర నుండి.. పుట్టినరోజు నాడు కోట్లు ఖర్చు పెట్టి సెలెబ్రేషన్స్ దాకా ఎన్నో విషయాలలో ప్రవీణ్ పేరు ముందుంటుంది. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి ప్రైవేట్ గన్ మెన్లతో వెళ్లిన చీకోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ దక్కించుకుని జైలుకు వెళ్లకుండా బయటపడ్డారు. థాయిలాండ్, నేపాల్ దేశాల్లో క్యాసినో వ్యవహారాల్లో కూడా చీకోటి ప్రవీణ్ పేరు వినిపించింది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఉపాధ్యక్షురాలు డీ.కే. అరుణ తదితర నాయకులను కలిశారు. మరికొద్ది రోజుల్లో రాజకీయాల్లోకి చికోటి ప్రవీణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Next Story