Sun Dec 22 2024 08:10:22 GMT+0000 (Coordinated Universal Time)
Half Day School: తెలంగాణలో ఆరోజు 'హాఫ్ డే' స్కూల్ !!
తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నవంబర్ 6 న...
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నవంబర్ 6 న సగం రోజు మాత్రమే స్కూల్ ఉండాలని తెలిపింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణనను సులభతరం చేయడానికి ఏకంగా 80,000 మంది సిబ్బంది పాల్గొంటారు.
సర్వేలో తెలంగాణలోని పాఠశాలల నుండి 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 6,256 మంది మండల స్థాయి టీచర్స్, 2,000 మంది మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొంటారు. అప్పర్ ప్రైమరీ హైస్కూల్స్లోని సెకండ్-గ్రేడ్ టీచర్లను జనాభా లెక్కల విధుల నుండి మినహాయించారు.
Next Story