Mon Mar 31 2025 05:50:23 GMT+0000 (Coordinated Universal Time)
Caste Census : కులగణన రీసెర్వేకు రెస్పాన్స్ అంతంత మాత్రమేనా?
తెలంగాణలో ఈ నెల 16వ తేదీ నుంచి కులగణన సర్వే ప్రారంభమయింది. అయితే రీసర్వే లోనూ రెస్పాన్స్ అంతగా లేదని చెబుతున్నారు.

తెలంగాణలో ఈ నెల 16వ తేదీ నుంచి కులగణన సర్వే ప్రారంభమయింది. అయితే రీసర్వే లోనూ రెస్పాన్స్ అంతగా లేదని చెబుతున్నారు. ప్రజలు ఎవరూ కులగణన సర్వేలో ఆసక్తి కనపర్చడం లేదనది ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. దాదాపు గతంలో జరిగిన సర్వేలో పాల్గొనని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ సర్వేను నిర్వహించినా ప్రయోజనం ఏ మాత్రం ఉంటుందన్నది మాత్రం తేలలేదు. ఇప్పటికే మూడు రోజులు గడిచినప్పటికీ ప్రజలు సర్వేలో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. తమ ఆస్తుల వివరాలను, సంపాదన విషయాలను ఎన్యుమరేటర్లకు చెప్పేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. అందుకే ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం సత్ఫలితాలిస్తుందా? లేదా? అన్న అనుమానం నెలకొంది.
మరో పది రోజులు మాత్రమే...
ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ కులగణన సర్వే జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే పదహారు నుంచి ప్రారంభించింది. గత సర్వేలో పాల్గొనని వారు ఈ సర్వేలో పాల్గొని తమ వివరాలను సిబ్బందికి అందచేయాలని కోరింది. తెలంగాణలో నాడు సర్వే జరిగినప్పుడు తాళం లేని ఇళ్లు 3.56 లక్షల ఇళ్లు ఉన్నాయని గుర్తించారు. ఈ గృహాలకు చెందిన యజమానులు తిరిగి రీసర్వేలో పాల్గొనాలని ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. విపక్షాలు సర్వే తప్పులు తడకగా ఉందని విమర్శలు చేయడంతో ప్రభుత్వం కూడా కొంత దిగివచ్చి తిరిగి రీ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని నిర్ణయించింది. కులగణన సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలను అందించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసినా...
తమ ఇళ్లకు రాని ఎన్యుమరేటర్లను రప్పించాలంటే ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించింది. కులగణన సర్వే లో పాల్గొనని వారు టోల్ ఫ్రీ 040,21111111 నెంబరుకు కాల్ చేయాలని కోరింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూకాల్ చేసి తమ ఇంటికి రావాలని కోరవచ్చు. వెంటనే ఎన్యుమరేటర్లు సాయంత్రలోపు మీ ఇంటికి వస్తారని ప్రభుత్వం పేర్కొంది. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణాల్లోని వార్డు కార్యాలయాల్లో కులగణన సర్వే వివరాలను అందించ వచ్చని ప్రభుత్వం తెలిపింది. కానీ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్స్ చాలా తక్కువగా వచ్చాయని చెబుతున్నారు. మొత్తం మీద మరో పది రోజులు మాత్రమే రీసర్వే కు గడువు ఉండటంతో రెస్పాన్స్ ఏ మేరకు వస్తుందన్నది అనుమానంగానే ఉంది.
Next Story