Mon Mar 31 2025 09:18:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి తెలంగాణలో కులగణన రీ సర్వే
తెలంగాణలో నేటి నుంచి కులగణన సర్వే తిరిగి ప్రారంభవుతుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ కులగణన సర్వే జరుగుతుంది

తెలంగాణలో నేటి నుంచి కులగణన సర్వే తిరిగి ప్రారంభవుతుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ కులగణన సర్వే జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత సర్వేలో పాల్గొనని వారు ఈ సర్వేలో పాల్గొని తమ వివరాలను సిబ్బందికి అందచేయాలని కోరింది. తెలంగాణలో నాడు సర్వే జరిగినప్పుడు తాళం లేని ఇళ్లు 3.56 లక్షల ఇళ్లు ఉన్నాయని గుర్తించారు. ఈ గృహాలకు చెందిన యజమానులు తిరిగి రీసర్వేలో పాల్గొనాలని ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది.
టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేస్తే...
కులగణన సర్వే లో పాల్గొనని వారు 040,21111111 నెంబరుకు కాల్ చేయాలని కోరింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూకాల్ చేసి తమ ఇంటికి రావాలని కోరవచ్చు. వెంటనే ఎన్యుమరేటర్లు సాయంత్రలోపు మీ ఇంటికి వస్తారని ప్రభుత్వం తెలిపారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణాల్లోని వార్డు కార్యాలయాల్లో కులగణన సర్వే వివరాలను అందించ వచ్చని ప్రభుత్వం తెలిపింది.
Next Story