Sun Dec 22 2024 17:59:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో సీబీబీ దాడులు కొనసాగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ కోసమే సీబీఐ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ , విశాఖతో పాటు పూణే, అహ్మదాబాద్ వంటి పలు నగరాల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సైబర్ క్రిమినల్స్ కోసమే సీబీఐ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
పదహారు మంది అరెస్ట్...
హైదరాబాద్ లోని వీఏజెక్ సొల్యూషన్స్ లో సీబీఐ అధికారులు విచారణ చేస్తునారు. 170 మంది సైబర్ క్రిమినల్స్ కోసం సీబీఐ అధికారుల వేట కొనసాగుతుంది. విశాఖపట్నంలోని వీసీ ఇన్ ఫ్రా మ్యాట్రిక్స్, అత్రియా గ్లోబల్ వంటి సంస్థల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ లో ఐదుగురు, విశాఖలో పదకొండు మంది సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
Next Story