Fri Nov 22 2024 22:22:26 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ వేగం పెంచిందా?
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును నిందితురాలిగా చేస్తూ సీబీఐ ఉత్వర్వులు జారీ చేసింది
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును నిందితురాలిగా చేస్తూ సీబీఐ ఉత్వర్వులు జారీ చేసింది. గతంలో 41 ఏ సీఆర్పీసీ నోటీసును సవరించి ఈనెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఇప్పటికే మూడు సార్లు ప్రశ్నించింది. సీబీఐతో పాటు గతంలోనూ ఈడీ విచారణ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఎటువంటి ప్రమేయం లేదని ఇప్పటి వరకూ కవిత వాదిస్తూ వచ్చారు.
నిందితురాలిగా చేరుస్తూ...
ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్లో కూడా పేర్కొన్నారు. సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నెల 28వ తేదీన విచారణ జరగనున్న నేపథ్యంలో 26వ తేదీన సీీబీఐ తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో పాటు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చడం కూడా ఈ కేసులో కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 26వ తేదీన కవిత సీబీఐ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
కవిత పీఏ ఇచ్చిన సమాచారంతో....
మరోవైపు కవిత పీఏ అశోక్ కౌశిక్ కూడా అడ్డం తిరిగాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముడుపులు ఇచ్చినట్లు న్యాయమూర్తి ఎదుట ఒప్పుకున్నారు. కవితతో పాటు అశోక్ కౌశిక్ ను కూడా నిందితుడిగా చేర్చారు. లిక్కర్ కేసులో ముడుపులు ఇచ్చినట్లు న్యాయమూర్తి ఎదుట అంగీకరించడంతో కవిత ఈ కేసులో చిక్కుల్లో పడినట్లేనని చెప్పాలి. ఈ నెల 26వ తేదీన విచారణ తర్వాత కల్వకుంట్ల కవిత విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.
Next Story