Mon Dec 23 2024 04:59:55 GMT+0000 (Coordinated Universal Time)
మూడు గంటలుగా సాగుతున్న విచారణ
మూడు గంటలుగా కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు
మూడు గంటలుగా కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 11 గంటలకు కవిత ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. అమిత్ అరోరా ఇచ్చిన సమాచారం మేరకు దక్షిణాది నుంచి ఢిల్లీ సర్కార్ లోని పెద్దలకు ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ. దీనిపైనే విచారణను కవిత ఇంట్లో సీీబీఐ అధికారులు కొనసాగిస్తున్నారని సమాచారం.
ఆరుగురు సభ్యులతో...
ఆరుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం విచారణ చేస్తుంది. కవిత స్టేట్మెంట్ రికార్డు చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి పలు అనుమానాలను కవితను అడిగి సీబీఐ అధికారులు తెలుసుకుంటున్నారు. ఒక మహిళ అధికారి కూడా కవితను ప్రశ్నిస్తున్నారు. ముందుగా రూపొందించిన ప్రశ్నల ప్రకారం కవితను విచారిస్తున్నారని తెలిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ విచారణ కొనసాగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story