Thu Dec 19 2024 16:13:32 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కల్వకుంట్ల కవిత మళ్లీ అరెస్ట్.. ఈసారి సీబీఐ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశముంది. కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చానున్నారని తెలిసింది. ఈ నెల 6వతేదీన తీహార్ జైలులో కవితను విచారించిన సీబీఐ అధికారులు నేడు అరెస్ట్ చేసినట్లు చూపించారు.
ఈడీ అరెస్ట్ చేసి...
కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు ఆమెను పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించడంతో ఆమెను తీహార్ జైలులో ఉంచారు. ఇప్పుడు సీబీఐ కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసింది.
Next Story