Sun Dec 22 2024 14:31:03 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ సీబీఐ నోటీసులు
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన హాజరు కావాల్సి ఉండగా అవినాష్ రెడ్డి తల్లి అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఆసుపత్రిలో ఉండి ఆమె బాగోగులను చూసుకుంటున్నారు. ఇదే విషయాన్ని సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి న్యాయవాదులు తెలిపారు.
ఈ నెల 22న...
దీంతో సీబీఐ అధికారులు మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయనను ఎనిమిదో సారి విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ఎల్లుండి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story