Sat Dec 21 2024 18:55:14 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి సీబీఐ కార్యాలయానికి సునీత
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించారు
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించారు. మూడు గంటలపాటు సునీత, రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సునీత, రాజశేఖర్ రెడ్డి ఇద్దరినీ కలిపి ప్రశ్నించిన సీబీఐ అధికారులు విచారించారు. తొలిసారి సునీత భర్తతో కలసి సీబీఐ కార్యాలయానికి వచ్చారు.
భర్తతో కలసి...
తన తండ్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని, హత్యకు గల కారణాలను తెలపాలంటూ సునీత గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సునీత భర్త రాజశేఖర్ రెడ్డిపైన కూడా కొన్ని ఆరోపణలు రావడంతో వారిని విచారించినట్లు తెలిసింది. దంపతుల వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ విచారణను స్పీడ్ చేసింది.
Next Story