Mon Dec 23 2024 06:40:56 GMT+0000 (Coordinated Universal Time)
కవిత ఇంటికి నేడు సీబీఐ
కవిత ఇంటికి నేడు సీబీఐ అధికారులు రానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమెను ప్రశ్నించనున్నారు
కవిత ఇంటికి నేడు సీబీఐ అధికారులు రానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమెను ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఆమె సాక్షిగా పేర్కొనడంతో ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. 160 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు ఈ స్కామ్ కు సంబంధించి విచారణ చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన అమిత్ అరోరా కస్టడీ నివేదికలో కవిత పేరు సీబీఐ పేర్కొంది. దక్షాదికి సంబంధించి కల్వకుంట్ల కవిత పేరుతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా వినిపించాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు సీీబీఐ అధికారులు ఆమె ఇంటివద్దనే స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు.
Next Story