Tue Dec 24 2024 02:46:55 GMT+0000 (Coordinated Universal Time)
రేపు కవిత ఇంటికి సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు రేపు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు. కవిత ఇంట్లోనే ఆమెను విచారిస్తారు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు రేపు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు. కవిత ఇంట్లోనే ఆమెను ఈ కేసు విషయంలో విచారించనున్నారు. కవిత స్టేట్మెంట్ ను రేపు రికార్డు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారించాల్సి ఉంది. అయితే తనకు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం 6వ తేదీ ఇతర కార్యక్రమాలు ఉన్నాయని చెప్పడంతో 11వ తేదీన విచారణకు వస్తామని సీీబీఐ అధికారులు తెలిపారు.
ప్రగతి భవన్ కు...
సీబీఐ అధికారులు ఇచ్చిన తేదీ, సమయానికి కవిత అంగీకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును పేర్కొన్నారు. 160 సీఆర్పీసీ కింద కవితకు నోటీసులను సీబీఐ జారీ చేశారు. దీంతో కవితను సాక్షిగానే సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారని చెబుతున్నారు. రేపు సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు న్యాయనిపుణులతో కూడా ఆమె చర్చించనున్నట్లు తెలిసింది.
Next Story