Tue Dec 24 2024 02:45:51 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు
ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 91 సీఆర్పీసీ కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి.
ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 91 సీఆర్పీసీ కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. త్వరలో మళ్లీ కవితను విచారిస్తామని, చెప్పిన చోట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిన్న ఏడున్నర గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది.
నిన్న విచారించిన
నిన్న సాక్షిగా అనేక విషయాలపై ఆరా తీసిన సీబీఐ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. విచారణ తేదీ, స్థలం అనేది త్వరలో మెయిల్ ద్వారా తెలియజేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ల ధ్వంసం చేయడంపైన కూడా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరోసారి నోటీసులు ఇవ్వడంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story