Tue Dec 24 2024 03:19:11 GMT+0000 (Coordinated Universal Time)
కవిత ఇంట్లో సీబీఐ అధికారులు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ బృందం చేరుకుంది. రెండు వాహనాల్లో కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ బృందం చేరుకుంది. రెండు వాహనాల్లో కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. కవితను విచారిస్తున్నారు. సీబీఐ బృందంలో ఒక మహిళ అధికారి కూడా ఉన్నారు. కవిత స్టేట్మెంట్ రికార్డును సీబీఐ అధికారులు చేయనున్న నేపథ్యంలో కవిత ఇంట్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.
ఇంటి పరిసర ప్రాంతాల్లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ను సాక్షిగా భావిస్తూ ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీబీఐ అధికారులు రాకమునుపే కవిత తన న్యాయవాదులతో భేటీ అయ్యారు. న్యాయవాదుల సమక్షంలోనే స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. కవిత ఇంటి వద్ద ఎలాంటి ఆందోళనలను నిర్వహించకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Next Story