Fri Mar 14 2025 23:40:37 GMT+0000 (Coordinated Universal Time)
అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ ఎత్తివేసింది

తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ ఎత్తివేసింది. అంజనీకుమార్ ఫలితాలు విడుదలయిన రోజు అప్పటి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున డీజీపీని కలవడం తప్పుపట్టిన ఎన్నికల కమిషన్ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది
ఎన్నికల కోడ్ ను...
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనను విధుల నుంచి తొలగించాలంటూ చీఫ్ సెక్రటరీని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో చీఫ్ సెక్రటరీ సూచనల మేరకు తెలంగాణ డీజీపీగా రవిగుప్తాను నియమించారు. ఇప్పుడు అంజనీకుమార్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనకు మళ్లీ ఏ పోస్టు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story