Mon Dec 23 2024 15:52:37 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ .. ఇక బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ పార్టీ అధినేత కేసీఆర్ కు సమాచారం ఇచ్చింది. దాదాపు నెల రోజుల క్రితం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీఈసీ నుంచి సమాచారం...
వెంటనే పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు అక్టోబరు 5వ తేదీన దరఖాస్తు చేసుకుంది. అయితే పేరుపై అభ్యంతరాలను కోరుతూ నెల రోజుల సమయమిచ్చారు. వచ్చినన అరకొర అభ్యంతరాలను పరిశీలించిన మీదట కేంద్ర ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ గా మార్చుకునేందుకు అనుమతిస్తూ లేఖ రాసింది.కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది.
Next Story