Fri Nov 22 2024 02:34:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఎవరి వాదనలు వారివి... ఎవరి అజెండా వారిదే
సెప్టంబరు 17న హైదరాబాద్ విమోచనదినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రజాపాలన వేడుకలను నిర్వహిస్తుంది.
సెప్టంబరు 17వ తేదీన హైదరాబాద్ విమోచనదినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1948లో హైదరాబాద్ సంస్థాలనం భారత ప్రభుత్వం వినీనమై సెప్టంబరు 17వ తేదీన భారతీయ జనతా పార్టీ నేతలు విమోచన దినోత్సవంగా జరుపుకుంటారు. అదే సమయంలో మిగిలిన పార్టీలు ఈరోజును ఇంటిగ్రేటెడ్ డే గా జరుపుకుంటాయి. ఒకరి మనోభావాలు దెబ్బతినకూడదన్న లక్ష్యంతో దీనిని విమోచన దినంగా పిలవరు. ఒక్క బీజేపీ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఈరోజు ముఖ్యఅతిధిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
ఆలస్యంగా భారత ప్రభుత్వంలో...
1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ కు మాత్రం స్వాతంత్ర్యం లభించలేదు. నిజాం పాలనలోనే హైదరాబాద్ సంస్థానం పదమూడు నెలల పాటు సాగింది. అయితే తర్వాత సెప్టెంబరు 17వ తేదీ 1948లో హైదరాబాద్ ను భారత దేశంలో విలీనం చేస్తూ నిజాం నిర్ణయం తీసుకున్నారు. యువతలో దేశభక్తిని నింపడానికి ప్రతి ఏడాది సెప్టంబరు 17వ తేదీన విమోచన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వేడుకలు ప్రధాన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉండనున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి దీనిపై వివాదం నడుస్తూనే ఉంది.
ఎన్నికల అస్త్రంగా...
ప్రధానంగా అన్ని పార్టీలూ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాయి. ప్రజల సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమ పార్టీల కార్యాలయంలో వేడుకలను నిర్వహించుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు తాము దగ్గరేనన్న భావన కలిగించేంందుకు పోటీ పడతాయి. అమరవీరులను స్మరించుకునేందుకు ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని బీజేపీ వాదిస్తుండగా, మిగిలిన పార్టీలు మాత్రం విలీన దినంగా సంబరాలు జరుపుకోవడం కొన్నేళ్ల నుంచి కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రజాపాలన దినోత్సవంగా జరపుకుంటోంది. అధికారంలో ఉన్న ఏ పార్టీ దీనిని విమోచన దినోత్సవంగా నిర్వహించడానికి అంగీకరించకపోవడాన్ని బీజేపీ తప్పుపడుతుంది. అదే సమయంలో అందరి మనోభావాలను గౌరవించాలని మిగిలిన పార్టీలు చెబుతున్నాయి. ఎవరి వాదనలు.. వారివి.
Next Story