Sun Dec 22 2024 18:41:09 GMT+0000 (Coordinated Universal Time)
నల్లగొండ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
నల్లగొండ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాగర్ కు నాలుగు లేన్ల రహదారిని నిర్మించనుంది
నల్లగొండ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నల్లగొండ నకిరేకల్లు మీదుగా నాగార్జున సాగర్ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ అంగీకరించింది. ఈ మేరకు 516 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం పథ్నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు వరసల బైపాస్ రోడ్డును ఈ నిధులతో నిర్మించనున్నారు.
నిధుల విడుదల...
ఈ నిధులు కూడా మంజూరు చేసినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. నకిరేకల్ నుంచి ఈ నాలుగు లేన్ల రహదారి నల్లొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా సాగుతుందని తెలిపారు. భారీ వాహనాలు వెళుతున్నందున ఈ రహదారిని విస్తరించి నాలుగు లేన్ల రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. నల్లగొండ నుంచి నకిరేకల్ మీదుగా నాగార్జున సాగర్ ప్రయాణం సుఖవంతంగా మారుతందని తెలిపారు.
Next Story