Mon Dec 23 2024 17:29:54 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.8 లక్షల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిది లక్షల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రబీ సీజన్ లో ఈ ధాన్యం సేకరణను జరపనన్నట్లు తెలిపింది. ఇప్పటికే 6.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ నుంచి సేకరించిన కేంద్ర ప్రభుత్వం మరో ఎనిమిది లక్షల టన్నుల సేకరణకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది.
ప్రభుత్వం రాసిన లేఖకు...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో ఉప్పుుడు బియ్యం సేకరణ సాఫీగా సాగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. కేంద్రం నిర్ణయాన్ని మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. రైతుల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
Next Story