Mon Dec 23 2024 01:52:03 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదల
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. 1,015 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. 1,015 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. రహదారుల అభివృద్ధికి ఈ నిధులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో రహదారుల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించాలని ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
వెయ్యి కోట్ల రూపాయలు...
మొత్తం 1,015 కోట్ల రూపాయలలో 498 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు, 516 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయిస్తూ నిధులను విడుదల చేసింది. ఇటీవల కురిసినభారీ వర్షాలకు రహదారులు దెబ్బతినడంతో ఈ నిధులను వాటికి వెచ్చించే అవకాశాలు రెండు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి రహదారుల అభివృద్ధికి, నిర్మాణానికి నిధులు విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story