Fri Nov 15 2024 01:35:32 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్
తానేమైనా టెర్రరిస్ట్ నా, క్రిమినల్ నా? ఎందుకు అడ్డుకుంటున్నారు ? డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎందుకు పరిశీలించకూడదు
బీజేపీ చేపట్టిన "ఛలో బాటసింగారం" ఉద్రిక్తంగా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు తమను బాటసింగారం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓఆర్ఆర్ పై బైఠాయించారు. జోరువానలో తడుస్తూనే రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు సీపీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తామెందుకు బాటసింగారం వెళ్లకూడదని కిషన్ రెడ్డి ప్రశ్నించగా.. పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించి పీవీ ఎక్స్ ప్రెస్ వే మీదుగా అక్కడి నుంచి తరలించారు.
తానేమైనా టెర్రరిస్ట్ నా, క్రిమినల్ నా? ఎందుకు అడ్డుకుంటున్నారు ? డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎందుకు పరిశీలించకూడదు అని కిషన్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఇది కల్వకుంట్ల రాజ్యాంగమా లేక పోలీసుల రాజ్యాంగమా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించడంలో తప్పేంటి ? అది కేంద్రమంత్రిగా తన బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఛలో బాటసింగారం కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓఆర్ఆర్ పై నుంచి తరలించారు. కాగా.. బీజేపీ చేపట్టిన "ఛలో బాటసింగారం"కు పోలీసుల నుంచి బీజేపీ అనుమతి తీసుకోలేదని, అందుకే కేంద్రమంత్రి సహా.. బీజేపీ నేతలను అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.
Next Story