Thu Jan 09 2025 02:12:02 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మేడిగడ్డకు కేంద్ర బృందం రాక
కుంగిపోయిన మేడిగడ్డ వంతెనను పరిశీలించేందుకు రేపు కేంద్ర బృందం తెలంగాణకు రానుంది
కుంగిపోయిన మేడిగడ్డ వంతెనను పరిశీలించేందుకు రేపు కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. కుంగిన పిల్లర్లను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. మేడిగడ్డ ప్రాజెక్టు వంతెన కుంగిపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదుతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఆరుగురు సభ్యులతో...
కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని వేసింది. రేపు సందర్భించి పూర్తి స్థాయి నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. మేడిగడ్డ వంతెన కుంగిపోవడంతో మహారాష్ట్ర, తెలంగాణల మధ్య రాకపోకలు స్థంభించాయి. అంతేకాకుండా ఇది రాజకీయంగా పెద్దయెత్తున చర్చనీయాంశమైంది. ఎన్నికల వేళ మేడిగడ్డ అంశం అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఆ ప్రాంతంలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు.
Next Story