Sun Apr 13 2025 10:16:07 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను చంద్రబాబు నియమించారు

తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ఆయన నుంచి నియామక పత్రాన్ని కాసాని జ్ఞానేశ్వర్ అందుకున్నారు. ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులును పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పొలిట్ బ్యూరోలో కూడా చంద్రబాబు ఆయనకు స్థానం కల్పించారు.
ఆర్థికంగా కూడా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కు బీసీల్లో మంచి పేరుంది. దీంతో బీసీ నాయకత్వంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ఉద్దేశ్యంతోనే ఆయనను నియమించినట్లు అర్థమవుతుంది. ఈ నెల10వ తేదీన కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను చేపడతారని తెలిసింది.
Next Story