Wed Jan 15 2025 09:48:06 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కేంద్రమంత్రులతో రేవంత్ వరస భేటీలు
ఢీల్లీలో సిఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు
ఢీల్లీలో సిఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు.సాయంత్రం కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించారు.
రాష్ట్రానికి రావాల్సిన...
మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్ర విభజన హామీలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయనతో చర్చించనున్నారు. రాత్రి ఏడు గంటలకు జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు.
Next Story