Mon Dec 23 2024 04:34:49 GMT+0000 (Coordinated Universal Time)
కస్తూర్భా కళాశాలలో విషవాయువులు లీక్.. 14 మందికి అస్వస్థత
కస్తూర్బా కాలేజీలో విష వాయువులు లీకై 14మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు
సికింద్రాబాద్ కస్తూర్భా గాంధీ కాలేజీ సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీకైంది. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీలో ఉన్న ల్యాబ్ లో విద్యార్థినులు ప్రయోగాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రయోగాలు చేస్తుండగా గ్యాస్ లీకవ్వడంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను స్థానిక ఆస్పత్రికి తరలించింది.
కస్తూర్బా కాలేజీలో విష వాయువులు లీకై 14మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. కస్తూర్భా కళాశాలలో విషవాయువులు లీక్.. 14 మందికి అస్వస్థత సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కళాశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రయోగాలు చేస్తుండగా గ్యాస్ ఎలా లీకైందని ఆరా తీస్తున్నారు. మరోవైపు గ్యాస్ లీకేజీలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Next Story