Mon Dec 23 2024 15:51:57 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డిపై హత్యానేరం నమోదు చేయండి
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు.
భువనగిరి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై హత్యయత్నం కేసు నమోదు చేయాలని హైకోర్టు లో కేసు వేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల చెరుకు సుధాకర్ కుమారుడికి ఫోన్ చేసి బెదిరించిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు.
కోర్టుకు చెరుకు సుధాకర్...
దీంతో చెరుకు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై హత్యాయత్నం నేరం నమోదు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై రేపు హైకోర్టు లో విచారణ జరగనుంది. కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే చెరుకు సుధాకర్ కోర్టును ఆశ్రయించారని కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు.
Next Story