Mon Dec 23 2024 08:50:03 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
లంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 4.8 శాతంతో మరో డీఏను మంజూరు చేశారు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 4.8 శాతంతో మరో డీఏను ప్రకటించారు. ఎన్నికల వేళ కేసీఆర్ వరసగా అందరికి షాక్‌ల మీద షాకులు ఇస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పైళ్లను దులిపి వాటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు. అలాగే కీలకంగా నియోజకవర్గాల్లో మారనున్న ఆర్టీసీ ఉద్యోగులను కూడా మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరో డీఏ మంజూరు...
అందులో భాగంగానే వారికి మరో డీఏను ప్రకటించారు. 4.8 శాతంతో మరో డీఏను ఇస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం తొమ్మిది డీఏలు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో హ్యాపీగా ఉన్న ఉద్యోగులు ఈ డీఏల మంజూరుతో మరింత హ్యాపీ అవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు.
Next Story