Tue Dec 24 2024 12:17:11 GMT+0000 (Coordinated Universal Time)
3న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ పండగ
తెలంగాణలో బతుకమ్మ పండగ కోసం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు
తెలంగాణలో బతుకమ్మ పండగ కోసం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 3వ తేదీ వరకూ బతుకమ్మ పండగ ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారుల సమావేశంలో తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన ట్యాంక్‌బండ్ వద్ద సద్దుల బతుకమ్మ జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు.
ఏర్పాట్లు చేయాలని...
దసరా పండగ సందర్భంగా తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతుంటాయి. తెలంగాణ సంస్కృతిలో భాగంగా జరిగే ఈ పండగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇప్పటికే దసరాకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 3వ తేదీన బతుకమ్మ జరిగే కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని, ట్యాంక్ బండ్ వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Next Story