Mon Dec 23 2024 12:13:05 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీకి కొత్త కార్లు... కేసీఆర్ ఆలోచన అదేనా?
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీటిని కార్గో విమానంలో ఢిల్లీకి పంపినట్లు సమాచారం .
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీటిని నేరుగా కార్గో విమానంలో ఢిల్లీకి పంపినట్లు సమాచారం అందుతుంది. ఈ కార్ల కొనుగోలుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకుంటున్న కేసీఆర్ కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఉత్తర భారత దేశంలో పర్యటించేందుకు వీలుగా ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా మారాలనుకుంటున్న కేసీఆర్ ఈ కొత్త కార్లను అందుకే కొనుగోలు చేశారంటున్నారు.
నేరుగా టీఆర్ఎస్ భవనానికి...
ఈ కార్లకు విజయవాడలోని ఇండ్రస్ట్రియల్ ఏరియాకు తీసుకు వచ్చి స్వల్ప మార్పులు చేసి వీటిని ఢిల్లీకి పంపినట్లు తెలిసింది. ఢిల్లీలోని టీఆర్ఎస్ భవనానికి ఈ కార్లు పంపినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో ప్రచారం నిర్వహించడానికి ఈ కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అన్నీ ఒకే రంగులో కాన్వాయ్ లో ఉండేలా ఈ కార్లను టీఆర్ఎస్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం మీద జాతీయ రాజకీయాల్లో మరింత జోరు పెంచేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లే కనిపిస్తుంది.
Next Story