Mon Dec 23 2024 08:25:06 GMT+0000 (Coordinated Universal Time)
మోదీకి కేసీఆర్ లేఖ
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల్లో పెట్టాల్సిన బిల్లులపై లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల్లో పెట్టాల్సిన బిల్లులపై తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఉభయ సభ సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
రిజర్వేషన్ బిల్లుపై...
అనంతరం ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మహిళ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కోరారు. అన్ని పార్టీలూ ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతాయని తెలిపారు. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంటులో పెట్టి ఆమోదించాలని కోరారు. గతంలోనే ఈ బిల్లులను తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి ఆమోదించిందన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
Next Story