Mon Dec 23 2024 13:46:25 GMT+0000 (Coordinated Universal Time)
ఎనిమిది వైద్య కళాశాలల ప్రారంభం
తెలంగాణలో ఎనిమిది వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
ఎనిమిది వైద్య కళాశాలలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈరోజు నుంచి ఎంబీబీఎస్ క్లాసులు ఈ కళాశాలల్లో నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ప్రారంభించాలన్న లక్ష్యాన్ని త్వరలోనే సాధిస్తామని తెలిపారు. ప్రస్తుతం 16 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, మరో 17 వైద్య కళాశాలలను ప్రారంభించుకోవాల్సి ఉందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కొత్త అధ్యాయమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయని కేసీఆర్ తెలిపారు.
ప్రజలకు చేరువగా...
గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ కు పరుగు తీయకుండా ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైద్య వైద్య సీట్లు కూడా పెరిగి, తెలంగాణ పిల్లలు వైద్య విద్యార్థులుగా తయారవుతున్నారన్నారు. మంచి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. వైద్య పరంగా అన్ని వసతులు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో కల్పిస్తున్నామని తెలిపారు. ప్రగతి భవన్ లో వర్చువల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కశాశాలల్లోని తరగతులను ప్రారంభించారు. అందరూ సమన్వయంగా పనిచేసి తెలంగాణలో పూర్తి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
Next Story