Fri Dec 27 2024 02:15:27 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి వర్గ విస్తరణ అప్పుడేనా?
తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయినట్లు తెలిసింది
తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయినట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. తన కేబినెట్ లో కొత్తవారికి నలుగురికి చోటు కల్పించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏడాదిన్నరగా భర్తీ కాని పోస్టులను ఈ దఫా భర్తీ చేస్తారంటున్నారు. ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తొలగించిన తర్వాత ఆయన నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖను హరీశ్ రావుకు అప్పగించారు.
ఇద్దరికి ఉద్వాసన...
అయితే ప్రస్తుతం కొన్ని శాఖల విషయంలో కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఇద్దరు ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాద్ లోని ఇద్దరు మంత్రులపై వేటు పడుతుందని చెబుతున్నారు. మంత్రి మల్లారెడ్డి పట్ల అసంతృప్తిని ఇటీవల ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాహాటంగా ప్రకటించడానికి ఇదే కారణమంటున్నారు. కొత్తవారికి అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది.
Next Story