Sun Dec 22 2024 23:58:03 GMT+0000 (Coordinated Universal Time)
మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవితను అరెస్ట్ చేయవచ్చని అభిప్రాయపడ్డారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవితను అరెస్ట్ చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. దర్యాప్తు సంస్థలతో అందరినీ వేధిస్తున్నారని, భయపడేది లేదని పోరాటం వదిలేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసులతో వేధిస్తూ....
రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. గంగుల కమలాకర్, రవిచంద్ర ఇప్పుడు కవిత వరకూ వచ్చారన్న కేసీఆర్ ఎంతమంచి పనిచేసినా బద్నాం చేస్తారని తెలిపారు. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలని పిలుపు నిచ్చారు. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని, కవితను కూడా పార్టీలో చేరమని వత్తిడి తెచ్చారని, మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Next Story