Mon Dec 23 2024 11:16:21 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రులు వచ్చి తిడతారు.. తర్వాత అవార్డులిస్తారు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా అన్ని రంగాల్లో భారతదేశంలో అగ్రపథాన ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా అన్ని రంగాల్లో భారతదేశంలో అగ్రపథాన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈరోజు కేంద్ర మంత్రులు తెలంగాణ వచ్చి తిట్టిపోతారని, ఆ తర్వాత అవార్డులిస్తారని తెలిపారు. వరంగల్ ప్రాంతంలో ప్రతిమ మెడికల్ కళాశాలను ఆయన ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అన్ని తెలంగాణలో నెంబర్ వన్ గా నిలపడంలో విజయవంతమయ్యామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసినందునే ఈ అభివృద్ధిని సాధించగలిగామని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురయ్యామని, వైద్య రంగంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు. ఒక్క వైద్య కళాశాలను కూడా ఇవ్వలేదన్నారు. తాము 12 మెడికల్ కళాశాలలను తెచ్చుకున్నామని చెప్పారు.
యువత ముందుకు రావాలి....
2014కు ముందు 2080 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, ఈరోజు 6,700 మంది తెలంగాణలో వైద్య సీట్లు ఉన్నాయన్నారు. రష్యా, ఉక్రెయిన్ లకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చదువుకోవచ్చన్నారు. పీజీ సీట్లు గతంలో 1,150 ఉంటే, ఇప్పుడు 2,500 సీట్లకు పెరిగాయని అన్నారు. సమాజం చైతన్యంగా ఉంటేనే అభివృద్ధి దానంతట అదే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ నాయకత్వం ఒకప్పుడు ఏమరపాటుగా ఉన్నందున రాష్ట్రం రాక తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. అన్ని వసతులు ఉండి తెలంగాణ ప్రజలు వంచించ పడ్డారన్నారు. దేశంలో ఏం జరుగుతుందన్నది యువత గమనించాలన్నారు. భవిష్యత్ మీదని, ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అందరిపైనా ఉందని వైద్య విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. వరంగల్ లో హైదరాబాద్ కు మించి రెండు వేల పడకలతో సూపర్ మెడికల్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నామని కేసీఆర్ తెలిపారు. మెడికల్ సిటీని వరంగల్ ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.
- Tags
- kcr
- development
Next Story