Fri Dec 27 2024 09:36:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేసీఆర్ కీలక సమావేశం
రాష్ట్రంలో డ్రగ్స్ పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు
రాష్ట్రంలో డ్రగ్స్ పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీలతో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్లు, ఎక్సైజ్ శాఖ, హోంమంత్రి పాల్గొననున్నారు. ఇటీవల రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దానిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
పూర్తిగా డ్రగ్స్ ను...
ప్రధానంగా డ్రగ్స్ ను పూర్తిగా నియంత్రించేందుకు కౌంటర్ ఇంటలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో ఈ కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో దొరికితే ఎంతటి వారినైనా వదిలపెట్ట వద్దని కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
Next Story