Mon Dec 23 2024 16:27:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రారంభిచంనున్నారు
భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రారంభిచంనున్నారు. మధ్యాహ్నం 12.37 గంటలకు బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ చేస్తున్నారు. నేడు కూడా యాగంలో పాల్గొంటారు.
రైతు సంఘాల నేతలు...
బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ తనకు నిర్దేశించిన ప్రత్యేక గదిలో కూర్చుంటారు.ఈ కార్యక్రమానికి కర్నాటక, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ లతో పాటు వివిధ రాష్ట్రాలనుంచి రైతు సంఘాల నేతల హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story