Mon Dec 23 2024 06:48:41 GMT+0000 (Coordinated Universal Time)
KCR : రాజ్‌భవన్ కు కేసీఆర్ రాజీనామా లేఖతో
మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను సమర్పించనున్నారు.
మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్ కు వెళతారని తెలుస్తోంది. గవర్నర్ వద్దకు వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అయితే ఆయన స్వయంగా వెళతారా? లేక ఎవరిచేతతోనైనా తన రాజీనామా లేఖను పంపనున్నారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
కేబినెట్ భేటీ...
ముందుగా నిర్ణయించిన మేరకు రేపు మంత్రి వర్గ సమావేశం రద్దయింది. రేపు మంత్రి వర్గ సమావేశం ఉన్నట్లు నిన్న ప్రకటించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కేబినెట్ భేటీని రద్దు చేసుకుని ఆయన వెళుతున్నారు. ప్రగతి భవన్ ను కూడా కేసీఆర్ వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
Next Story