Mon Dec 23 2024 09:38:24 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు
తెలంగాణ ముఖ్యమంత్రి రికార్డు సృష్టించారు. తొలిసారి వినాయక నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ట్యాంక్‌బండ్‌కు వచ్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి రికార్డు సృష్టించారు. తొలిసారి ఖైరతాబాద్ గణేశుడి వినాయకుడి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ట్యాంక్‌బండ్‌కు వచ్చారు. గణేశ్ నిమజ్జనం జరుగుతున్న సమయంలో వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హిస్టరీ క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రావడం, గ్రౌండ్ రియాలిటీని పరిశీలించడానికి భక్తుల మధ్య పాల్గొనేందుకు రావడం పట్ల గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తొలిపూజ చేసి...
ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజలు చేసిన ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి రికార్డు క్రియేట్ చేశారు. ఆయన ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రావడం చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు నగర మేయర్, పీసీసీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన అక్కడ నిమజ్జన ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Next Story